ఫ్రెండ్స్
మాములుగా తత్కాల్ టిక్కెట్ల పైన క్యాన్సిల్ చేస్తే అసలు డబ్బు వాపస్ ఇవ్వరు. కానీ కొన్ని సందర్భాలలో తత్కాల్ స్కీం కింద
బుక్ చేసిన టిక్కెట్లకు ఛార్జ్ ఇంకా
తత్కాల్ ఛార్జ్ వాపస్ ఇవ్వడానికి రైలే డిపార్ట్మెంట్ అంగీకరించింది. అవేంటో
చూద్దాం.
1) ప్రయాణీకుని
టికెట్ ఎక్కడనుంచి బుక్ అయిందో అక్కడికి ట్రైన్ 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే...( కానీ
ప్రయాణికుని బోర్డింగ్ పాయింట్ నుంచి కాదు )
2) ఒక వేళా ట్రైన్
వెళ్ళవలసిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి మళ్లించినప్పుడు ఆ మార్గంలో ప్రయాణీకుడు ప్రయాణించడం ఇష్టం లేనప్పుడు
3) ట్రైన్ మళ్లించిన మార్గంలో ప్రయాణీకుని ఎక్క
వలసిన మరియు దిగవలసిన స్టేషన్ లేనప్పుడు,
4) ప్రయాణీకునికి
టికెట్ లో సూచించిన కోచ్ ని ట్రైన్ కి జోడించకుండా మరియు అదే క్లాస్ లో సీట్ ని
అతనికి కేటాయించలేక పోయినప్పుడు
5) ప్రయాణీకుని
బుక్ చేసిన తరగతి కంటే తక్కువ తరగతిలో సీటు
కేటాయించినప్పుడు దానికి అతడు అలా తక్కువ తరగతిలో ప్రయాణించడం అంగీకరించక
పోయినప్పుడు
అయితే
ప్రయాణీకుడు అంగీకరించి తక్కువ తరగతిలో ప్రయాణించినట్లైతే తరగతుల తేడామొత్తాన్ని అతనికి వాపసు ఇస్తారు.
No comments:
Post a Comment