Thursday 17 May 2018

ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చెయ్యాలా

ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చెయ్యాలా
ఈ సింపుల్ టిప్స్ తో మీరే సరిచూసుకోండి
ముందుగా uidai వెబ్సైట్ లోకి వెళ్లి అడ్రస్ update రిక్వెస్ట్ ఆన్లైన్ ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త ట్యాబు ఓపెన్ అవుతుంది. ఆ పేజీ లోని instructions ను పూర్తిగా చదువుకుని పేజీ కింది భాగంలో కనిపించే PROCEED  బటన్ పై క్లిక్ చెయ్యండి. తర్వాత ఓపెన్ అయ్యే మెనులో మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి text  వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వన్ టైం పాస్ వర్డ్ మీ మొబైల్ నెంబర్ కి వస్తుంది.

ఫోన్ లో వచ్చిన ఓటీపీ ని సంబంధిత కాలమ్ లో ఎంటర్ చేస్తే డేటా update రిక్వెస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ లో అడ్రస్ మార్పులు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే documents upload పేజీ లోకి వెళ్తారు. అక్కడ అడ్రస్ ధ్రువీకరణ డాక్యుమెంట్ ప్రూఫ్ ను మీరు upload  చెయ్యాలి. తర్వాత స్టెప్ లో బీపీఓ సర్వీస్ ప్రొవైడర్ ను సెలెక్ట్ చేసుకోవటం ద్వారా ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది.

ఆధార్ కార్డు తీసుకొనేప్పుడు అనుసంధానించి మొబైల్ వాడుకలో లేకుంటే ఇక్కడ వివరాలు మార్చడం కుదరదు. ఓటీపీ వల్లనే ఈ ప్రక్రియ సాధ్యమౌతుంది.

ఆన్లైన్ లో మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ వెరిఫికేషన్ athentication పూర్తయిన తర్వాత uidai  రికార్డులలో update  అవుతుంది. update   అయిందా   లేదా తెలుసుకోవాలంటే

పేజీ లోకి వెళ్లి ఆధార్ నెంబర్, URN (update request number) నెంబర్ ఎంటర్ చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్  చేస్తే వైటింగ్ అప్రూవల్ అనో లేక అప్రూవల్ అయిందనే స్టేటస్ తెలుస్తుంది. అప్రూవల్ పూర్తి అయిందని తెలిస్తే కొత్త కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.

ఆధార్ కార్డు డౌన్ లోడ్ చెయ్యాలంటే ముందుగా


లింక్ ఓపెన్ చేసి ఎన్రోలెమెంట్ నెంబర్ లేక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పూర్తి pincode  తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. గెట్ వన్ టైం పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కి పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే పిడిఎఫ్ format  లో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది.

No comments: