వామ్మో ATM భూతం
దమ్ముంటేనే (డబ్బుంటేనే)
ఎటిఎం కి రా
ఒక వైపు ప్రభుత్వం డిజిటల్
పేమెంట్స్ అంటూ ఊదర కొడుతుంటే మరో వైపు
బ్యాంకులేమో డెబిట్ కార్డులు వాడే వారిని చావ బాదేస్తున్నాయి. క్రెడిట్ కార్డులు
వాడేవారికన్నా డెబిట్ కార్డులు వాడే వారి సంఖ్యే అత్యధికం. ఈ రోజుల్లో వాళ్ళు
వీళ్ళని లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర డెబిట్ కార్డు ఉండడం సర్వ సాధారణ విషయం. కానీ
ఇప్పుడు ఆ డెబిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించక పోతే ఇక ఇంతే సంగతులు.
మీ అకౌంట్ లో డబ్బులు లేక
పోయినా డెబిట్ కార్డు ఎటిఎం లో గీస్తే ఇక బ్యాంకులు ముక్కు పిండి చార్జీలు వసూలు
చేస్తాయి. మీరు మీ ఖాతాలో వున్నా నిల్వ కంటే ఎక్కువ డ్రా చెయ్యాలని ప్రయత్నిస్తే
మీ ఖాతాలో డబ్బులు లేవని చెప్పడమే కాక మీరు అలా చేసినందుకు చార్జీలు వసూలు
చేస్తారు. మీరు తెలియక చేసినా తెలిసి చేసినా మీ డబ్బు గల్లంతే.
ఇలాంటి ప్రతి లావా దేవికి
బ్యాంకులు 17 నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.మీరు చేసే ఏ లావాదేవికైనా transaction decline అని వచ్చిందంటే ఇక
చార్జీల మోతే. ఈ రకమైన చర్యలను చాలా మంది
మేధావులు కూడా నిరసిస్తున్నారు. ప్రభుత్వము డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం
బూడిదలో పోసినట్లవుతూ వుంది.
అయితే బ్యాంకులు ఏం
చెబుతున్నాయంటే కనీసం నగదు నిల్వ కూడా తెలుసుకోకుండా.... ఉదాహరణకి మొదట వెయ్యి
ట్రై చేసి తర్వాత 500 ట్రై చేసి అదీ కాకపోతే 200 ట్రై చెయ్యడం
ఎక్కువై పోయిందంటున్నాయి. ప్రతి వారు ఇలా చేస్తుంటే వెనక వున్న వినియోగ దారుడు
ఇబ్బంది పడతాడు. సమయం చాలా వృధా అవుతుంది. అలాంటి చర్యలను అరికట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకో
వలసి వచ్చిందని చెబుతున్నాయి. పైగా చెక్ బౌన్స్ చార్జీలకంటే ఈ చార్జీలు చాలా
తక్కువని ప్రతి ఒక్కరు దీన్ని సమర్ధించి ప్రోత్సహించాలని అంటున్నాయి.
సో ప్రతి బ్యాంకు ఖాతా
దారులు జాగ్రత్త డబ్బులు ఉంటేనే ఎటిఎం కి వెళ్ళండి. లేకుంటే అంతే సంగతులు. వున్న
డబ్బు కూడా వూడి పోయే ప్రమాదముంది.